ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను చేపట్టిన ఏపీ సీఎం తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో పలు మార్పులను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను అందుబాటులోకి (1,068 new 108 ambulances) తీసుకువస్తున్నారు. రేపు ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను (ambulances) ప్రారంభించనున్నారు విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబ