Skip to main content

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది. కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ, జూలై 31వరకు అన్‌లాక్‌-2 నిబంధనలు అమల్లోకి.., అన్‌లాక్‌-2 విధివిధానాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ
జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థల్లో పనులు ప్రారంభమవుతాయి. జులై 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, ఆడిటోరియంలు మూసివేయబడే ఉంటాయి.కంటైన్మెంట్‌ ప్రదేశాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ అవసరమైన కార్యకలాపాలు మాత్రమే నిర్వహించేలా కేంద్రం కఠిన నిబంధనలు జారీ చేసింది. అంతే కాకుండా కంటైన్మెంట్‌ ప్రదేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వాలను ఆదేశించింది. అన్‌లాక్‌ 1.0లో ప్రార్ధనా మందిరాలు, ఆలయాలు తెరిచిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

అనుమతించేవి, అనుమతించబడనివి 
1. ప్రార్థనా స్థలాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్స్ కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల తెరిచి ఉండటానికి అనుమతించబడతాయి
2. షాపులు ఒకేసారి 5 మందికి అనుమతి ఇవ్వవచ్చు. ఇది కంటైన్మెంట్‌ జోన్లలో కాదు. అయినప్పటికీ, వారు తగినంత శారీరక దూరాన్ని నిర్వహించాలి.
3. పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ సంస్థలు 2020 జూలై 31 వరకు మూసివేయబడతాయి.
4. మెట్రో సేవలు కూడా మూసివేయబడతాయి.
5. సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, వినోద ఉద్యానవనాలు, థియేటర్లు, బార్‌లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు మరియు ఇలాంటి ప్రదేశాలు తెరవబడవు.
6. అన్‌లాక్ 2 లో ఇచ్చిన అవసరమైన కార్యకలాపాలు మరియు ఇతర సడలింపులు మినహా, రాత్రి 10.00 మరియు ఉదయం 5 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
7. మరిన్ని రైళ్లు మరియు విమానాలు ఉంటాయి - ఇవి రాబోయే రోజుల్లో ప్రకటించబడతాయి.
8. లాక్డౌన్ జూలై 31 వరకు కంటైనేషన్ జోన్లలో ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. ఈ జోన్లను రాష్ట్ర, యుటి ప్రభుత్వాలు జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
9. నియంత్రణ మండలాల్లో, కఠినమైన నియంత్రణ నిర్వహించబడుతుంది. అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయి.
10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణా సంస్థలు జూలై 15, 2020 నుండి అమలులోకి అనుమతించబడతాయి.

Comments

Popular posts from this blog

108,104 Ambulance Services in AP: రేపే 108, 104 సర్వీసులు ప్రారంభం, అత్యాధునికంగా తీర్చిదిద్దిన 1068 అంబులెన్సులను లాంచ్ చేయనున్న ఏపీ సీఎం వేయస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను చేపట్టిన ఏపీ సీఎం తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో పలు మార్పులను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను అందుబాటులోకి (1,068 new 108 ambulances) తీసుకువస్తున్నారు. రేపు ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను (ambulances) ప్రారంభించనున్నారు విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబ...

ఏపీ సీఎంపై పూరి జగన్నాథ్ ప్రశంసలు

ఏపీ ఇవాళ సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా విస్తతరిస్తున్న వేళ జగన్ చేసిన ఈ పనికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తోంది.  ఏపీ సీఎం జగన్  ఇవాళ రాష్ట్రంలో 104, 108 సర్వీసుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్  జగన్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ట్విట్టర్ వేదికగా హ్యాట్పాఫ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తులు మరియు తీవ్రమైన అమరికల కోసం AP లోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ‘108,104’ అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారికి అభినందనలు అంటూ పూరి ట్వీట్ చేశారు. ఏపీలో మరో గొప్ప కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య రంగంలో ప్ర...