ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మహేష్ ఇప్పుడు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశు రామ్ తో సర్కార్ వారి పాట సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి ఇంకా వెళ్లకపోయినా అభిమానుల్లో మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మహేష్ బాబు మూడవ సారి కూడా 100 కోట్లు కొట్టబోతున్నాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు సార్లకు వంద కోట్లు కొట్టిన హీరో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.మాములు సినిమాలతో కూడా ఆయన 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల తేలికగా కొడుతున్నారు.ఇది మహేష్ బాబు స్టార్ డమ్ కి ఉదాహరణ
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుండి లీక్ అయినా ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటి వరుకు మహేష్ బాబు ని మనం ఈ లుక్ లో ఎప్పుడు చూసి ఉండము.షార్ట్ హెయిర్ తో పూర్తి స్థాయి మీసకట్టు గడ్డం తో సోషల్ మీడియా లో లీక్ అయినా ఈ ఫోటో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.మహేష్ బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు విశ్వసనీయ వీరగాలా సమాచారం.అందులో ఒక్క పాత్ర లుక్ ఇది.ఇప్పటి వరుకు అసలు షూటింగ్ చెయ్యలేదు కదా,మరి ఈ ఫోటో ఎలా లీక్ అయ్యింది అబ్బా అనుకుంటున్నారా?అక్కడికే వస్తున్నాం అండీ.ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కి సంబంధించి కొన్ని టెస్ట్ షూట్లు చేసారు అట దర్శకుడు పరశురామ్.అందులో భాగంగానే ఇప్పుడు మనం క్రింద చూస్తున్న ఫోటో ని తీశారు.అంతే కాకుండా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఒక్క డైలాగ్ తో కూడిన టీజర్ ని కూడా విడుదల చేస్తున్నారు అట.ఆ టీజర్ లో కూడా మహేష్ బాబు ఇదే లుక్ లో కనిపించబోతున్నట్టు వినికిడి
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు తన తదుపరి చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి తో ఉండబోతున్నట్టు సమాచారం.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు రాజమౌళి.ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో రాజమౌళి త్వరలోనే మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్టు తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే.కానీ అది ఆర్ ఆర్ తర్వాత లేదా అనేది క్లారిటీ గా తెలీదు.ఈ కన్ఫ్యూషన్ కి త్వరలోనే తెరపడనుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రాజమౌళి ప్రెస్ మీట్ ద్వారా తెలియచేయనున్నారు.భారత దేశం గర్వించే దర్శకుడైన రాజమౌళి మహేష్ బాబు లాంటి సూపర్ దొరికితే ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మరి ఈ వెండితెర దృశ్యకావ్యం ని చూడాలంటే మరికొద్ది సంవత్సరాలు వేచి చూడాల్సిందే


Comments
Post a Comment