దిగ్గజ వాహన తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా తన టూవీలర్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. దేశంలో బీఎస్ 6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 వాహనల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే బీఎస్ 4 వాహనాలు విక్రయించడానికి లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజులే గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరో మోటొకార్ప్ తన బీఎస్ 4 వాహనాలపై ఏకంగా రూ.15 వేల తగ్గింపును అందిస్తోంది. అయితే ఓ వైపు లాక్‌డౌన్, మరో వైపు కొత్త వాహన చట్టం అమలులోకి రావడంతో మోటార్ వాహనాల తయారీ రంగ సంస్థలు ఢీలా పడ్డాయి. దీంతో తమ సేల్స్ పెంచుకోవడంతో పాటు కొత్త బైక్ కొనాలని అనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల హీరో మోటోకార్ప్ సరికొత్త డిస్కౌంట్ తో ముందుకు వచ్చింది.
బైక్, స్కూటర్ కొనేవారికి రూ. 15 వేల వరకు తగ్గింపు ఇస్తామని తెలిపింది. అయితే ఇది కేవలం బీఎస్ 4 వాహనాలకు మాత్రమేనని షరతులు విధించారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 వాహనల విక్రయాలు ప్రారంభం కావడంతో గతంలో తయారు చేసిన బీఎస్ 4 వాహనాలు అలాగే మిగిలిపోయాయి. వాటిని అమ్ముకునే సమయంలోనే లాక్‌డౌన్ విధించడంతో కేంద్రం వారికి వెసులుబాటు ఇచ్చింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల్లోనే వాటిని విక్రయించుకోవాలని సూచించింది. దీంతో హీరో మోటొకార్ప్ బైక్‌పై రూ.10,000, స్కూటర్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్ బుకింగ్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తక్కువ ధరలో బైక్ కొనాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Comments
Post a Comment