- తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- రెండు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి
- ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్న రజనీకాంత్
- తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొబైల్ షాపు ఓనర్లైన వీరిని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారంటూ పోలీసులు అరెస్టు చేశారు. లాకప్ లో ఉన్న వీరు రెండు రోజుల తేడాతో మృతి చెందారు. వీరి మృతిపై స్థానికులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. పోలీసులే హత్య చేశారంటూ ఆందోళన చేపట్టారు.
ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును విచారించిన హైకోర్టు... ఈ కేసును సీబీఐ స్వీకరించేంత వరకు సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ ఘటనపై సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి
July 1: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్ 1 నుంచి అన్‌లాక్ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది. కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...
Comments
Post a Comment