Skip to main content

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!ఏపీకి రెయిన్

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ దిశగా ఒంపు తిరిగడంతో.. ఈ ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉంటే శుక్రవారం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్సీపట్నం,హిరమండలం, కూనవరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. కాలువలు, కొండగెడ్డలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మాకవరపాలెంలో యాతపేట, కొత్తవీధి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో మురుగు కాలువలు, రోడ్లు ఏకమయ్యాయి. మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.

Comments

Popular posts from this blog

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా బెంగళూరు బాలికకు వల.. సహజీవనం చేద్దామంటూ

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బెంగళూరు బాలికను సహజీవనం చేద్దామంటూ నమ్మించి హైదరాబాద్‌కు రప్పించేందుకు ఏర్పాట్లన్నీ చేశాడు. చివర్లో ఆమె తండ్రికి తెలియడంతో వాడి బండారం బయటపడింది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన బాలికను నమ్మించి సహజీవనానికి రెడీ అయిన  హైదరాబాద్  యువకుడి ప్రయత్నం ఆఖరి నిమిషంలో బెడిచికొట్టింది. హైదరాబాద్‌లోని తన వద్దకు వచ్చేయాలంటూ ఆమె విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ పంపాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆఖరి నిమిషంలో విమానాశ్రయంలో తన కూతురిని అడ్డగించి యువకుడిపై  బెంగళూరు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్‌ లేఔట్‌ ప్రాంతానికి చెందిన బాలిక ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడంతో తరుచూ సోషల్‌మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. రోజూ ఛాటింగ్ చేసుకుంటూ ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో ఆమె తన వ్యక్తిగత చిత్రాలు...

మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ టీజర్

 ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మహేష్ ఇప్పుడు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశు రామ్ తో సర్కార్ వారి పాట సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి ఇంకా వెళ్లకపోయినా అభిమానుల్లో మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మహేష్ బాబు మూడవ సారి కూడా 100 కోట్లు కొట్టబోతున్నాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు సార్లకు వంద కోట్లు కొట్టిన హీరో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.మాములు సినిమాలతో కూడా ఆయన 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల తేలికగా కొడుతున్నారు.ఇది మహేష్ బాబు స్టార్ డమ్ కి ఉదాహరణ ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుండి లీక్ అయినా ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటి వరుకు మహేష్ బాబు ని మనం ఈ లుక్ లో ఎప్పుడ...