టాలీవుడ్‌లో కోట శ్రీనివాసరావు పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు.కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాలు చేస్తున్న ఈ విలక్షణ నటుడు, కేవలం తెలుగుకే పరిమితం కాలేదు.
భారతదేశంలోని దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించి తనదైన మార్క్‌ను వేసిన ఈ నటుడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు.
అయితే కాస్త ఆగండి.ఆయన ముఖ్యమంత్రి అయ్యింది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో మాత్రమే.
తన యాక్టింగ్ కెరీర్‌లో అనేకసార్లు ముఖ్యమంత్రి పాత్రల్లో నటించిన కోట, తెలంగాణ సీఎం పాత్రలో తొలిసారి నటిస్తున్నాడు.
ఇక ఈ పాత్ర ఆయన చేయబోయే సినిమాకే కీలకం కానుండటం మరో విశేషం.
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నాడు.శుక్రవారం కోట పుట్టినరోజు సందర్భంగా సదరు చిత్ర యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఆర్.రామన్న చౌదరి అనే పాత్రలో తొలిసారి తెలంగాణ సీఎంగా కోట కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాను సీటీఎస్ స్టూడియోస్, ఎస్టీవీ ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా చరణ్ రోరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
మొత్తానికి చాలా రోజుల తరువాత కోట శ్రీనివాసరావు మరోసారి పొలిటికల్ పాత్రలో నటిస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్ని్స్తోంది.
మరి ఈ సినిమాలో కోట పాత్ర ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
Comments
Post a Comment