గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త.... గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఈ కంపెనీలు రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై ప్రస్తుతం చర్చిస్తున్నాయి. ఎన్‌పీసీఐతో ఈ కంపెనీల చర్చలు సఫలం అయితే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నెలవారీ బిల్లులను సులభంగా చెల్లించొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్ గా చెల్లించవచ్చు. వాటి చెల్లింపులకు చివరి తేదీ ఎప్పుడు, ఎలా చెల్లించాలి తదితర విషయాల గురించి ఇక ఆలోచించాల్సిన పని ఉండదు. దాదాపు నెల రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా కంపెనీల వర్గాల ద్వారా తెలుస్తోంది
India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి
July 1: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్ 1 నుంచి అన్‌లాక్ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది. కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...
Comments
Post a Comment