Skip to main content

పేదోల్లమే మనకు ఓటేసే హక్కు ఉందికాని నాయకులకు సూచించే హక్కు లేదు

 


స్టేషన్లో ట్రేన్ మూవ్ అవుతుండగా ఒక ట్రంకు పెట్టె పట్టుకొని ఒక భర్త,భార్య ఎక్కారు.ఆ మహిళ అక్కడే ఉన్న డోర్ దగ్గర కూర్చుంది,తన భర్త టెన్షన్ తో అక్కడేఅ నిలబడ్డాదు ఎందుకంటే అది రిజర్వేషన్ బోగి అని తనకు తెలుసు. ఇంతలో టికెట్ కలెక్టర్ రావడంతో తన దగ్గర ఉన్న టికెట్స్ తీసి చూపించాడు.వెంటనే టికెట్ కలెక్టర్ ఇవి జెనరల్ బోగీవి, తర్వాత స్టేషన్ రాగానే దిగి వెళ్ళి ఆ బోగిలో ఎక్కండి అని చెప్పాడు.దాంతో అతను సర్ నా భార్యా, ఈ ట్రంకు పెట్టెతో అదెక్కడానికి చాలా కష్టపడ్డాం సార్, అయినా సాధ్యం కాకనే దీంట్లోకొచ్చాం సార్.తర్వాతి స్టేషన్లో దిగండి లేదంటే అయిదువందలు ఫైన్ కట్టండి అన్నాడు టి.సి. 

                            ఆ భార్యా,భర్తలు తమ కూతురికి బిడ్డ పుట్టడంతో చూడ్డానికి వెల్తున్నారు. అతను ఒక చిన్నపాటి వ్యాపారవేత్త దగ్గర పని చేస్తాడు. పట్టుబట్టడంతో తన యజమాని రెండు రోజుల సెలవుతో పాటు ఏడు వందలు అడ్వాన్స్ జీతం ఇచ్చాడు.అతను తన దగ్గరున్న డబ్బుల్లోంచి వంద రూపాయలు టి.సి కి ఇస్తూ  " సార్ మీము ఆ జనరల్ బోగీలో ఎక్కలేము ఇదిగో ఇక్కడే డోర్ దగ్గర నిల్చుంటాము, ప్లేజ్ మమ్మల్ని మీరు నిల్చోనిస్తే మాకు పెద్ద ఫేవర్ చేసిన వారు అవుతారు" అన్నాడు దాంతో టి.సి.వంద రూపాయలు దేనికి పనికి రావు, ఎనమిది వందలు ఇవ్వండి ఇద్దరికీ సీట్స్ ఇస్తాను లేదంటే వచ్చే స్టేషన్లో దిగండి అన్నాడు. దాంతో అతని భార్య " సార్ ఎనమిది వందలు మా బిడ్డ ప్రసవానికే మేము ఖర్చుపెట్టలేకపోయాము.మేము చాలా బీదవాల్లం సార్, మమ్మల్ని వెళ్ళనివ్వండి అంది.దాంతో టి.సి మళ్ళీ "సరే అయితే నాలుగు వందలివ్వండి ఒకరికి రిసిప్ట్ ఇస్తాను ఇద్దరు కూర్చోవచ్చు "అన్నాడు. ఈసారి అతను ఇంకో వందరూపాయలు తీసి సార్ "ఈ  రెండు వందలూ తీసుకోండి మాకు సీట్ వద్దు,రిసిప్ట్ వద్దు మేము ఇక్కడే నిల్చుంటాం "అన్నడు. 

                        దాంతో ఈ సారి టి.సి కోపంగా నో నో నేను కంపల్సరీగా రిసిప్ట్ రాయాలి. బుల్లెట్ ట్రేయిన్ ప్రాజెక్ట్ మొదలవబోతుంది,అది లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కనుండి తేవాలి డబ్బులు, ఇలా రిసిప్ట్ రాసి కలెక్ట్ చేయాలి, అది పైనుండి పెద్దల ఆర్డర్ కూడా నాలుగు వందలివ్వండి,లేదంటే దిగిపోండి "అన్నాడు.దాంతో అతను ఏమి చేయలేక నాలుగు వందల రూపాయలిచ్చాడు.

                                  ఆ సమయంలోనే అక్కడే ఉన్న ఇద్దరు పాసింజర్స్ బుల్లెట్ ట్రేయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. వారి పక్కకున్న మిగతా పాసింజర్స్ ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.కాని ఆభార్యా భర్తలు మాత్రం ఏడుపుకు దగ్గరగా ఉన్నారు.ఎంతలా అంటే వాల్లని చూస్తే ఏదో సంతాప ఫంక్షన్ కి వెల్తున్నట్టు ఉన్నారు.వాల్లకు ఆ నాలుగు వందల రూపాయలతో ఎలా మానేజ్ చేయాలో అర్దం కావట్లేదు.అల్లుడిని అప్పు అడిక్కుంటే అది మంచి పద్దతి కాదు అని ఇద్దరు అనుకుంటున్నారు.

                           ఇంతలో అతను నాదగ్గర వందో నూటయాభై రూపాయలు ఉన్నాయి, మనం స్టేషన్ నుండి మన బిడ్డ ఇంటికి నడుచుకుంటూ వెల్దాం, మద్యలో ఏం తినొద్దు అలగైతే మనకు రెండొందలు మిగులుతాయి.ఇంటికి వెళ్ళేటప్పుడు పాసింజర్ రైలులో వెల్దాం కాకపోతే ఒక రోజు లేట్ అవుతుంది,నా యజమాని తిడుతాడు నా మనవడికోసం అవన్ని భరిస్తాను అయినా మనకు ఇంకో వంద రూపాయలు తక్కువ పడుతున్నాయ్ అన్నాడు. దాంతో అతని భార్య మన మనవడికి నువ్వొక వందరూపాయలు నీనొక వంద రూపాయలు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాం కదా, మనం ఏమన్నా వేరు వేరా ఇద్దరం ఒకటే కదా ఇద్దరం కలిసి ఒక వందరూపాయలిద్దాం అప్పుడు మనకు కావలసిన డబ్బు ఉంటుంది అంది.దాంతో ఆమే భర్త కల్లల్లో నీల్లతో గిఫ్ట్ తగ్గిస్తే ఎలా అన్నాడు, దాంతో అమే నువ్వు ఎందుకలా బాధ పడుతున్నావ్ మన కూతురు మన ఇంటికి వచ్చినపుడు ఇంకో రెండు వందల రూపాయలు ఎక్కువిద్దాం అంటూ ఏడ్చింది.

                        తన కల్లనుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ " నేను మోడిజీని కలిస్తే బుల్లెట్ ట్రేయిన్ లాంటివి స్టార్ట్ చేసే బదులు ఇలాంటి ట్రేయిన్స్ కి ఇంకో రెండు మూడు జనరల్ బోగీలు పెట్టండి మాలాంటి పేదోల్లకు ఉపయోగ పడతాయ్" అని అదుగుతాను అంది.దాంతో అతను తన భార్యతో "నువ్వు అమాయకురాలివే మనం పేదోల్లమే మనకు ఓటేసే హక్కు ఉందికాని నాయకులకు సూచించే హక్కు లేదు ఏద్వకే యుగాలనుండి పేదోడి బతుకు పేదోడిదేనే అన్నాడు.


ఈ పేజీ పోస్ట్ లు మీకు నచ్చినట్లైతే మా పేజ్ ని లైక్ చేయండి,షేర్ చేయండి….

Comments

Popular posts from this blog

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా బెంగళూరు బాలికకు వల.. సహజీవనం చేద్దామంటూ

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బెంగళూరు బాలికను సహజీవనం చేద్దామంటూ నమ్మించి హైదరాబాద్‌కు రప్పించేందుకు ఏర్పాట్లన్నీ చేశాడు. చివర్లో ఆమె తండ్రికి తెలియడంతో వాడి బండారం బయటపడింది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన బాలికను నమ్మించి సహజీవనానికి రెడీ అయిన  హైదరాబాద్  యువకుడి ప్రయత్నం ఆఖరి నిమిషంలో బెడిచికొట్టింది. హైదరాబాద్‌లోని తన వద్దకు వచ్చేయాలంటూ ఆమె విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ పంపాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆఖరి నిమిషంలో విమానాశ్రయంలో తన కూతురిని అడ్డగించి యువకుడిపై  బెంగళూరు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్‌ లేఔట్‌ ప్రాంతానికి చెందిన బాలిక ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడంతో తరుచూ సోషల్‌మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. రోజూ ఛాటింగ్ చేసుకుంటూ ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో ఆమె తన వ్యక్తిగత చిత్రాలు...

మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ టీజర్

 ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మహేష్ ఇప్పుడు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశు రామ్ తో సర్కార్ వారి పాట సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి ఇంకా వెళ్లకపోయినా అభిమానుల్లో మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మహేష్ బాబు మూడవ సారి కూడా 100 కోట్లు కొట్టబోతున్నాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు సార్లకు వంద కోట్లు కొట్టిన హీరో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.మాములు సినిమాలతో కూడా ఆయన 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల తేలికగా కొడుతున్నారు.ఇది మహేష్ బాబు స్టార్ డమ్ కి ఉదాహరణ ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుండి లీక్ అయినా ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటి వరుకు మహేష్ బాబు ని మనం ఈ లుక్ లో ఎప్పుడ...