India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి
July 1: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్ 1 నుంచి అన్‌లాక్ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది. కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...
Comments
Post a Comment