Skip to main content

ఇలాంటి తల్లులు భూమిపై అరుదుగా జన్మిస్తారు...యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ..

 ఇలాంటి తల్లులు భూమిపై అరుదుగా జన్మిస్తారు...యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ... తమ మానాలను సైతం పక్కనపెట్టి చేసిన సహాయం ఇలాంటి తల్లులు కడుపున ఎందుకు పుట్టలేదా అన్న బాధ  కలగకమానదు.....


ప్రస్తుతం సమాజంలో మానవత్వం చచ్చిపోయింది. కళ్లెదుట ప్రాణం పోతున్నా.. కనీసం ఎవరూ స్పందించడం లేదంటూ రోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు మంచి మనసు ఉన్న మహాత్ములు ఉన్నారు. ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న స్త్రీలే అందుకు నిదర్శనం. తమ కళ్ల ముందు ప్రాణాలు పోతున్న వ్యక్తులను కాపాడేందుకు వీరు.. తమ ఒంటిపై ఉన్న చీరలను తీసి మరి వారిని కాపాడారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


తమిళనాడు రాష్ట్రం పెరంబళూరు జిల్లా కొట్టరాయి ప్రాంతానికి చెందిన మహిళలు.. తమ మానాన్ని పక్కన పెట్టి యువకుల ప్రాణం నిలబెట్టారు. స్థానికంగా ఉన్న ఓ డ్యామ్ లో కొందరు కుర్రాళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారు.


వారిని చూసిన ముగ్గురు మహిళలు.. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఎలాంటి తాడు లేకపోవడంతో.. తమ ఒంటిపై ఉన్న చీరలను విప్పదీసి.. ఆ మూడింటినీ ముడి వేసి.. వెంటనే డ్యామ్ లో ఉన్న కుర్రాళ్లకు అందేలా వేశారు. వారు పట్టుకోగానే.. తమ బలమంతా ఉపయోగించి వారిని పైకి లాగారు.


ఆ యువకులు క్రికెట్ మ్యాచ్ అనంతరం డ్యామ్ లో స్నానానికి వచ్చి ప్రమాదంలో పడినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో డ్యామ్ లో నీటి మట్టం బాగా పెరిగిపోయింది. దీంతో.. వారు ప్రమాదంలో పడ్డారు.


కాగా.. వారిని చూసిన సెంటమిజ్ సెల్వి, ముతమల్ మరియు ఆనందవల్లి లు వెంటనే తమ చీరల సహాయంతో కాపాడారు. అయితే... మొత్తం నలుగురు కుర్రాళ్లు నీటిలో మునగగా.. ఇద్దరిని ఈ మహిళలు కాపాడగలిగారు. మరో ఇద్దరు నీటిలో మునిగివడం గమనార్హం. కాగా. సదరు మహిళలు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారికి ఎంత గొప్ప అవార్డు ఇచ్చిన తప్పులేదని పేర్కొంటున్నారు. నెట్టింట కూడా వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Comments

Popular posts from this blog

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...

108,104 Ambulance Services in AP: రేపే 108, 104 సర్వీసులు ప్రారంభం, అత్యాధునికంగా తీర్చిదిద్దిన 1068 అంబులెన్సులను లాంచ్ చేయనున్న ఏపీ సీఎం వేయస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను చేపట్టిన ఏపీ సీఎం తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో పలు మార్పులను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను అందుబాటులోకి (1,068 new 108 ambulances) తీసుకువస్తున్నారు. రేపు ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను (ambulances) ప్రారంభించనున్నారు విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబ...

ఏపీ సీఎంపై పూరి జగన్నాథ్ ప్రశంసలు

ఏపీ ఇవాళ సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా విస్తతరిస్తున్న వేళ జగన్ చేసిన ఈ పనికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తోంది.  ఏపీ సీఎం జగన్  ఇవాళ రాష్ట్రంలో 104, 108 సర్వీసుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్  జగన్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ట్విట్టర్ వేదికగా హ్యాట్పాఫ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తులు మరియు తీవ్రమైన అమరికల కోసం AP లోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ‘108,104’ అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారికి అభినందనలు అంటూ పూరి ట్వీట్ చేశారు. ఏపీలో మరో గొప్ప కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య రంగంలో ప్ర...