విశాఖపట్నం పెను ప్రమాదం నుండి బయటపడిన :-
ఆరోజు అంటే 6 ఏప్రిల్ 1942 వ సంవత్సరం ఎండాకాలం మిట్టమధ్యాహ్నం రెండవప్రపంచయుద్ధం తీవ్రంగా ఉన్న రోజుల్లో బంగాళాఖాతంలో జపాన్ యుద్ధనౌక వైస్ ఎడ్మిరల్ ఒజ్వాజిసాబ్యురొ నేత్రత్వంలొ యుద్ధవిమానౌక రెయుజొ 29 టైపు 97 కేటిటార్పెడోబాంబర్స్ తో ప్రవేసించింది అంతకుముందే బంగాళాఖాతంలో ఉన్నకొన్ని వాణిజ్య నౌకలు, బ్రిటీష్ వారి యుద్ధనౌకలు ఇండోరా , హర్పాసా , మాల్డా , డార్న్డనస్ , ఘండారా లను ముంచివేసాయి.అందులొ నుండి 5 యుద్ధవిమానాలు 250 మరియు 60 కేజీల బాంబులతొ 6 ఏప్రిల్ 1942 ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట ఒంటిగంట నలభై ఐదు నిమిషాలు మధ్యలో సెంట్ ఎల్లోసిస్ పాఠశాల మీదుగా విశాఖ నౌకాశ్రయం లొపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసాయి వాటి ముఖ్య ఉద్ధేశ్యం నూతన హర్బర్ , సింధియా నౌకాశ్రయం,విద్యుత్ కేంద్రం మరియు స్టీమర్ పోర్టులపై బాంబులు వేసి ధ్వంసం చేయాలని కానీ వైమానిక దాడిని పసిగట్టి నగరంలో సైరన్లు మ్రొగాయి ప్రభుత్వం వైమానికదాడి సమయంలో తమనుతాము రక్షించుకునేందుకు చర్యలను ప్రజలకు సూచించాయి. అమెరికా యుద్ధనౌక నుండి ఏంటీఎయిర్ క్రాప్ట్ తుపాకులు ప్రేలాయి అందువలన జపాన్ యుద్ధవిమానాలు నౌకాశ్రయం లోనికి ప్రవేశించలేకపోయాయి..మరలా అవే విమానాలు సాయంత్రం 5:25 -5:45 మధ్యలో రెండవసారి దాడిచేసాయి కానీ బాంబులు నిర్దేశించిన గమ్యాన్ని తాకలేకపొయాయి కానీ పోర్టులొ ఐదు అడుగుల వ్యాసం కల కాంక్రీటు పైపుపై బాంబు పడింది దాడినుండి కాపాడుకోవడానికి అందులో దాగివున్న పి.అప్పలస్వామి , ఈటి పెద్దయ్య , షేక్ ఇబ్రహీం , ఎమ్పాదప్పడు , కే.మునిస్వామి , ఇ.డి. అక్బర్ అనే నౌకాశ్రయ కార్మికులు మరియు కే.ఆనందరావు , ఎన్.మాధవరావు అనే రక్షణశాఖ ఉద్యోగులు ఆ దాడిలో స్వర్గస్తులయ్యారు. ఆ సంఘట స్మారకార్థం ఒక ఫలకం ఇప్పటికీ పోర్టులో ఉంది. అయితే పోర్టులో ఉన్న మెరీన్ ముల్లర్ అనే నౌకపై కొన్ని బాంబులు పడినా ప్రేలలేదు అదే ప్రేలిఉంటే అందులొ ఉన్న 2000 వేల టన్నుల మందుగుండు ప్రేలి విశాఖపట్నం తుడిచిపెట్టుకొని పోయి రెండవ పెరెల్ హర్భర్ గా మారేది. అందులొ ప్రేలని ఒక బాంబు విశాఖమ్యూజియంలొ భద్రపరిచారు.
బాంబుల దాడి భయంతో ప్రభుత్వం రైళ్ళను రద్దుచేసింది , దుఖాణాలు మూతపడ్డాయి. ప్రజలు జట్కా , ఎడ్లబండ్లపై మరియు కాలినడకన యద్ధభయంతొ పట్టణప్రజలు చాలామంది తమ స్థిరాస్తులను కారుచౌకగా అమ్మివేసి తట్టాబుట్టా సర్దుకొని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. తిండిగింజలకు కరువు కేవలం నూకలగంజి బంగాళాదుంపలు తిని పొట్టనింపుకున్నారు.ఆతరువాత రేషన్ మూలంగా కొన్ని సంవత్సరాలు నూకలు, గోధుమలు కొరకు ప్రజలు బారులు తీరారు. అప్పటి భయానక సంఘటన పాతతరం వారికి మరపురానివి.ఈ ఫోటోలొ తెల్లని మచ్చలు బాంబులు వేసిన ప్రాంతం.
Comments
Post a Comment