గూగుల్ మ్యాప్స్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది. తాజా బీటా నివేదిక ప్రకారం, గూగుల్ మ్యాప్స్ లో 'రైడ్ సర్వీసెస్' అనే కొత్త సర్వీస్ ని తీసుకోరాబోతుంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని పంపడం ద్వారా మరింత ఖచ్చితమైన ఛార్జీలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ 'రైడ్ సర్వీసెస్' సెట్టింగ్ అనేది ఉబెర్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ సర్వీసులు అనేవి వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా బీటా వెర్షన్ లో బిల్డింగ్ నంబర్లు మరియు క్రాస్‌వాక్ గుర్తులను జోడించినట్లు నివేదిక పేర్కొంది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలో మరిన్నీ నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం. న్యూయార్క్ వంటి నగరాల్లోని వీధుల్లో మ్యాప్ లను జూమ్ చేయడం ద్వారా మీరు భవనాల సంఖ్యలను మరియు క్రాస్‌వాక్ గుర్తులను గుర్తించవచ్చని నివేదికలోని స్క్రీన్‌షాట్‌లలో తెలుస్తుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ లో మరో కొత్త సేల్)
విశాఖపట్నం పెను ప్రమాదం నుండి బయటపడిన :- ఆరోజు అంటే 6 ఏప్రిల్ 1942 వ సంవత్సరం ఎండాకాలం మిట్టమధ్యాహ్నం రెండవప్రపంచయుద్ధం తీవ్రంగా ఉన్న రోజుల్లో బంగాళాఖాతంలో జపాన్ యుద్ధనౌక వైస్ ఎడ్మిరల్ ఒజ్వాజిసాబ్యురొ నేత్రత్వంలొ యుద్ధవిమానౌక రెయుజొ 29 టైపు 97 కేటిటార్పెడోబాంబర్స్ తో ప్రవేసించింది అంతకుముందే బంగాళాఖాతంలో ఉన్నకొన్ని వాణిజ్య నౌకలు, బ్రిటీష్ వారి యుద్ధనౌకలు ఇండోరా , హర్పాసా , మాల్డా , డార్న్డనస్ , ఘండారా లను ముంచివేసాయి.అందులొ నుండి 5 యుద్ధవిమానాలు 250 మరియు 60 కేజీల బాంబులతొ 6 ఏప్రిల్ 1942 ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట ఒంటిగంట నలభై ఐదు నిమిషాలు మధ్యలో సెంట్ ఎల్లోసిస్ పాఠశాల మీదుగా విశాఖ నౌకాశ్రయం లొపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసాయి వాటి ముఖ్య ఉద్ధేశ్యం నూతన హర్బర్ , సింధియా నౌకాశ్రయం,విద్యుత్ కేంద్రం మరియు స్టీమర్ పోర్టులపై బాంబులు వేసి ధ్వంసం చేయాలని కానీ వైమానిక దాడిని పసిగట్టి నగరంలో సైరన్లు మ్రొగాయి ప్రభుత్వం వైమానికదాడి సమయంలో తమనుతాము రక్షించుకునేందుకు చర్యలను ప్రజలకు సూచించాయి. అమెరికా యుద్ధనౌక నుండి ఏంటీఎయిర్ క్రాప్ట్ తుపాకులు ప్రేలాయి అందువలన జపాన్ యుద్ధవిమానాలు నౌకాశ్రయ